Magazines

ప్రపంచ సాంకేతిక కేంద్రంగా తెలంగాణ

1 గంట క్రితం

Telangana as a Global Technology Hub
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 2 నిమిషాల చదవడం

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

పోచారం ఇన్ఫోసిస్‌లో 
కొత్త సా‌ఫ్ట్‌వేర్‌ ‌బ్లాక్‌ ‌ప్రారంభం

నవతెలంగాణ-సిటీబ్యూరో

​ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం గల ప్రతిభావంతులు, అభివృద్ధి చెందుతున్న ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ మద్దతుతో ప్రపంచ సాంకేతిక కేంద్రంగా తెలంగాణ తన స్థానాన్ని స్థిరపర్చుకుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మేడ్చల్‌-‌మల్కాజిగిరి జిల్లా పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్‌ పోచారం డెవలప్‌‌మెంట్‌ ‌సెంటర్‌ ‌విస్తరణలో భాగంగా శుక్రవారం కొత్త సాఫ్ట్‌‌వేర్‌ ‌బ్లాక్‌‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఇన్ఫోసిస్‌ పోచారం క్యాంపస్‌ ‌విస్తరణ మరో మైలురాయి అన్నారు. ఇది సాంకేతిక ఆధారిత వృద్ధి తదుపరి దశలో మన యువత భాగస్వామ్యం కావడానికి ఇది కొత్త అవకాశాలను సృష్టిస్తుందన్నారు. ఈ స్థాయి పెట్టుబడులు గ్లోబల్‌ ఎంటర్‌ ‌ప్రైజెస్‌‌కు ప్రధాన గమ్యస్థానంగా హైదరాబాద్‌ ‌స్థానాన్ని బలోపేతం చేస్తాయని తెలిపారు. భవిష్యత్‌‌కు సిద్ధంగా ఉన్న ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వ్యవస్థ తీర్చిదిద్దాలన్న తమ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తాయని చెప్పారు.

ఇన్ఫోసిస్‌ చీఫ్‌ ‌ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ ‌జయేష్‌ ‌సంఘరాజ్‌ ‌కా మాట్లాడుతూ.. తమ వృద్ధి ప్రమాణంలో హైదరాబాద్‌ ‌కీలక పాత్ర పోషించిందని తెలిపారు. పోచారం క్యాంపస్‌ ‌విస్తరణ ఈ ప్రాంతం పట్ల తమకున్న నిరంతర నిబద్ధతను ప్రతిభింబిస్తుందన్నారు. ఈ కొత్త సదుపాయం తమ కార్యకలాపాలను విస్తరించేందుకు, ప్రత్యేక నైపుణ్యాలు గల ప్రతిభావంతులను విస్తరించేందుకు, ప్రపంచవ్యాప్త ఖాతాదారుల కోసం సంక్లిష్టమైన పరివర్తన కార్యక్రమాలను అమలు చేసేందుకు తమ ఈ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని వివరించారు. ఏఐ వినియోగాన్ని సంస్థలు వేగవంతం చేస్తున్న తరుణంలో, ప్రపంచ స్థాయి ప్రతిభను, అధునాతన మౌలిక సదుపాయాలను, విస్తృత సామర్థ్యాలను ఒక చోట చేర్చే వ్యూహాత్మక కేంద్రంగా ఈ క్యాంపస్‌ ‌పని చేస్తుందన్నారు. తద్వారా ఖాతాదారులు ఆవిష్కరణలను ప్రోత్సహిం చడానికి, పోటీతత్వాన్ని మెరుగు పర్చుకోవడానికి, వ్యాపారంలో దీర్ఘకాలిక విలువను సాధించడానికి సహాయపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార సాంకేతిక, ఎలక్ర్టానిక్స్‌, కమ్యూనికేషన్స్‌, పర్రిశమలు, వాణిజ్యం, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌బాబు, మేడ్చల్‌-‌మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్‌ (‌రెవెన్యూ) విజయేందర్‌‌రెడ్డి, డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్‌ ‌యాదవ్‌, మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఇన్ఫోసిస్‌ ఎగ్జిక్యూటివ్‌ ‌వైస్‌ ‌ప్రెసిడెంట్‌ ‌సునీల్‌ ‌కుమార్‌ ‌ధారేశ్వర్‌, సీనియర్‌ ‌వైస్‌ ‌ప్రెసిడెంట్‌ ‌నీలాద్రి ప్రసాద్‌ మిశ్రా, ఇన్ఫోసిస్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్