Magazines

స్థానిక యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం

21 నిమిషాల క్రితం

The goal is to provide employment to local youth.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026 | 2 నిమిషాల చదవడం

3 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్

సీసీఐ పున:ప్రారంభానికి కృషి : 
 మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌బాబు

రూ.58.85 కోట్లతో నిర్మించిన 
ఐటీ టవర్ ప్రారంభం

​నవతెలంగాణ-ఆదిలాబాద్‌ రూరల్

​ఆదిలాబాద్‌ను ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చేసి, స్థానిక యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రూ.58.85 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్‌ను బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిధుల కొరతతో నిలిచిపోయిన ఐటీ టవర్ నిర్మాణాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లకుండా స్థానికంగానే ఉపాధి పొందేలా ఐటీ సంస్థలను తీసుకొస్తున్నామని చెప్పారు. ఐటీ టవర్‌లో టాస్క్ శిక్షణ కేంద్రం, ఇంక్యుబేషన్ హబ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్టీటీ డేటాలో 300 మంది, ఎన్ ల్యాబ్స్‌లో 250 మంది, వైడర్ సాఫ్ట్‌వేర్‌లో 20 సీట్లు, పోస్ట్రిట్ ఏఐలో 50 మందికి ఉపాధి కల్పించేలా సంస్థలు కార్యకలాపాలు ప్రారంభిం చాయని వెల్లడించారు. స్థానిక యువతకు సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఆదిలాబాద్‌లో 3వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయను న్న‌ట్టు మంత్రి ప్రకటించారు. జిల్లాలో విమానా శ్రయం ఏర్పాటుకు సీఎం ప్రత్యేక చొరవ తీసుకుంటు న్నారని, భూసేకరణ, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసి త్వరలో శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. సాంకేతిక, విధానపరమైన సమస్యల ను పరిష్కరించి పరిశ్రమ పునరుద్ధరణకు చర్యలు తీసుకుం టామని చెప్పారు. ఎంపీ జి.నగేష్ మాట్లాడుతూ.. ఐటీ టవర్ ప్రారంభం జిల్లా యువత భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. విమానాశ్రయం, జాతీయ రహదారు లు, రైల్వే, సీసీఐ పునరుద్ధరణ వంటి ప్రాజెక్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ముందుకు సాగాలని ఆకాంక్షిం చారు. ​ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఉద్యోగావ కాశాలు పెరుగుతున్న నేపథ్యంలో మరో ఐటీ టవర్ మంజూరు చేయాలని కోరారు. స్థానిక పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు కల్పించాలన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ ఐటీ, పారిశ్రా మిక సంస్థల్లో స్థానిక ఆదివాసీ యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించాలని, ఈ ప్రాంతంలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఐటీ శాఖ సెక్రటరీలు అనుదీప్, శశాంక్, అదనపు కలెక్టర్లు ఎస్. రాజేశ్వర్, ఆర్ఎస్. చిత్రు, ఎస్పీ అఖిల్ మహాజన్, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ శివప్రసాద్, ఆర్డీఓ జగదీశ్వర్‌రావు, మున్సిపల్ చై‌ర్‌పర్సన్ బండారి అనూష, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాం‌త్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్