Magazines

పట్టభద్రుల ఓటరు ప్రక్రియను వేగవంతం చేయాలి

55 నిమిషాల క్రితం

registration
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 2 నిమిషాల చదవడం

ఫారం-18 దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి


నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నల్లగొండ- వరంగల్- ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓటరు నమోదు దరఖాస్తులను ఎప్పటికప్పుడూ పరిశీలించి, అర్హు లైన పట్టభద్రులకు ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నల్లగొండ కలెక్టరేట్‌‌ లోని ఆర్వో చాంబర్‌‌లో గురువారం ఉమ్మడి నల్లగొండ జిల్లాల ఈఆర్వోలు, ఆర్డీవోలతో పట్ట భద్రుల నియోజకవర్గ ఓటరు నమోదు ప్రక్రియపై ఆయన సమీక్ష నిర్వహించారు. పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియలో నల్లగొండ జిల్లా ముందుండటం పట్ల అభినందించారు. యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లోనూ ఓటరు నమో దు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదే శించారు. దరఖాస్తుల పరిశీలనలో అప్రమత్తంగా ఉండాలని, క్షుణ్నంగా పరిశీలించి పరిష్కరించా లని సూచించారు. పట్టభద్రుల విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు, ప్రొవిజనల్ సర్టిఫికెట్లు, ఉద్యోగుల సర్టిఫికెట్లను నిబంధనల ప్రకారం జాగ్రత్తగా పరిశీలించాలన్నారు.

అవసరమైతే అదనపు సిబ్బం దిని నియమించి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. డూప్లికేట్ ఓట్లను తిరస్కరించాలని స్పష్టం చేశారు. బీఎల్‌ఓలు ఓటర్ల నివాస వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, విద్యార్హతల ధ్రువీకరణను సంబంధిత అధికారులు పరిశీలించాలని చెప్పారు. ఓటర్లకు అందుబాటు లో ఉండేలా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధ్యాయులకు వారి నివాస ప్రాంతాలకు సమీపంలోని పోలింగ్ కేంద్రాలను కేటాయించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, జంబో బ్యాలెట్ బాక్సుల లభ్యతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏ జిల్లాలో నైనా సామగ్రి కొరత ఉంటే వెంటనే తెలియజేయా లని, అవసరమైన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. నల్లగొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. జిల్లాలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. డీటీసీలోని కంప్యూటర్ కేంద్రంలో 20 కంప్యూటర్లను ఏర్పాటు చేసి, సిబ్బందితో రెండు షిఫ్టుల్లో రాత్రింబవళ్లు దరఖాస్తులను పరిశీలిస్తు న్నట్టు వివరించారు. ఎంజీ యూనివర్సిటీ విద్యా ర్థుల సహకారం తీసుకుంటున్నామన్నారు. ఆర్డీఓ స్థాయిలో పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఈ సమావే శంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ట్రైనీ సహాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ థియాన్ మావి, ఉమ్మడి జిల్లాల ఈఆర్ ఓలు,(ఆర్డీవోలు), ఏఈఆర్ఓలు (తహసీల్దార్లు), ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్