రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
రూ.2కోట్లతో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభం
నవతెలంగాణ-చిట్యాల
వ్యవసాయరంగానికి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా రైతులకు ఇబ్బందులు లేకుండా విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటుకు ప్రజా ప్రభుత్వం ముందుంటుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు అన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ఒడితల గ్రామంలో నూతనంగా రూ.2 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రైతులకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు కలగకుండా సబ్స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఈ ప్రాంతంలో నెలకొన్న అనేక సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు చేశారన్నారు. అవసరమైన సబ్ష్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. ఎల్‌నినో ప్రభావం దేశవ్యా ప్తంగా ఉందని, విద్యుత్ డిమాండ్ పెరగడంతో పాటు భూగర్భ జలాలు అడుగంటడంతో ఇతర ప్రాంతాల నుంచి విద్యుత్ తీసుకొస్తున్నామన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటంతో పాటు ఉపాధి పరంగా సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తు న్నట్టు వివరించారు. రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకుంటూ పంటలు సాగు చేయాలని సూచించారు. రబీ పంటల సాగుపై రైతులకు అధికారులు సంపూర్ణ అవగాహన కల్పించాలని చెప్పారు. తాగునీరు, విద్యుత్ సమస్యలు లేకుండా చూస్తామని, ఇందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ ప్రాంత ప్రజలకు గోదావరి జలాలను అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, సర్పంచ్ బండి భగవాన్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతి నిధులు, కాంగ్రెస్ జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)