Wednesday, August 26, 2026
E-PAPER
Homeజాతీయంపుణెలో వీధి కుక్క అరాచకం..video

పుణెలో వీధి కుక్క అరాచకం..video

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: మహారాష్ట్ర పుణెలో వీధి కుక్క అరాచకం చేసింది. చంటిబిడ్డతో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళపై వీధికుక్క అకస్మాత్తుగా దాడి చేసింది. వీడియో ప్రకారం..ఓ ఇంటి ముందు ఆపి ఉన్న కారు చాటునుంచి ఓ కుక్క సడెన్‌గా బయటకు వచ్చింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళ కాలును గట్టిగా కొరికింది. ఈ హఠాత్పరిణామంతో మహిళ భయపడిపోయింది. బిడ్డను కిందకు జారవిడిచింది. దీంతో చిన్నారి రోడ్డుపై పడిపోయింది. తలకు గాయమైంది. స్థానికులు అప్రమత్తమై బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -