మున్సిపల్ చైర్మన్ ఆకాష్
నవతెలంగాణ – ఆసిఫాబాద్
అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ ఆకాష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జనకపూర్ పద్మశాలి సంఘానికి మంజూరైన షెడ్డు నిర్మాణ పనులను సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ హైమద్, వైస్ చైర్మన్ అహ్మద్ తో కలసి భూమి పూజ చేశారు. అంతకుముందు మార్కండేయలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఎమ్మెల్యే కోవలక్ష్మి సహకారంతో ఆసిఫాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆకాష్ తెలిపారు. ప్రజల సహకారంతో పట్టణాన్ని అభివృద్ధిపరిచేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ చిలువరి వెంకన్న, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, జనకాపూర్ సంఘం అధ్యక్షుడు భద్రయ్య, నాయకులు గుండా శ్యామ్, శైలేందర్, మహేష్, శంకర్, రాజన్న, సత్యనారాయణ, రవి, గిరి, శ్రీకాంత్, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల అభివృద్ధికి కృషి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



