నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రమాదవశాత్తు పాముకాటుతో మహ్మద్ రిజ్వన్ (15) అనే విద్యార్థి మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన తాడిచెర్లలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల పూర్తి కథనం ప్రకారం.. రిజ్వన్ తల్లిదండ్రులు అక్బర్-అమినాబి అనారోగ్యంతో భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో గత వారం నుంచి చికిత్స పొందుతున్నారు. ఎప్పటిలాగే రిజ్వన్ తమ ఇంట్లో సోమవారం రాత్రి నిద్రలోకి జారుకున్నాడు. మంగళవారం ఉదయం 6 గంటలకు మెడపై మంటతో గాయం కపించడంతో తనను పాము కుట్టినట్లుగా తల్లిదండ్రులకు ఫోన్ లో సమాచారం అందించాడు. వారు ఈ విషయాన్ని వారి బంధువులకు తెలిపారు. బంధువులు రిజ్వాన్ ఇంటికెళ్లి చూసేసరికి బాలుడి నోట్లో నుంచి నురుగులు వస్తున్నాయి. దీంతో వారు వెంటనే తాడిచెర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి బాలుడు మృతి చెందాడని చెప్పారు. రిజ్వన్ అకాల మరణంతో తలిదండ్రులు, బంధువులు, తోటి స్నేహితులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.
పాముకాటుతో విద్యార్థి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



