- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
నవతెలంగాణ-హైదరాబాద్: రేపు 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యువత ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పరీక్షలు పారదర్శకంగా, సురక్షితంగా, విశ్వసనీయంగా మార్చడానికి ప్రభుత్వం సమగ్ర సంస్కరణలను చేపడుతోందని రాష్ట్రపతి అన్నారు. విద్యార్థులే భారతదేశ భవిష్యత్తుకు రూపశిల్పులని కొనియాడారు. వారి భవిష్యత్తును కాపాడటానికి ప్రభుత్వం సమాజం రెండింటి నుండి ఉమ్మడి, సమష్టి కృషి అవసరమని రాష్ట్రపతి ఉద్ఘాటించారు. మహిళా నేతృత్వంలోని అభివృద్ధి, ఆర్థిక వృద్ధి ,సమ్మిళిత పాలనలో కీలక మైలురాళ్లను ప్రస్తావిస్తూ, 2047 నాటికి ‘వికీర్ణ భారత్’ సాధన దిశగా భారతదేశం వేగంగా సాధిస్తున్న ప్రగతిని ఆమె తన ప్రసంగంలో స్థూలంగా వివరించారు. న్యాయం, సమ్మిళితత్వం, ప్రజా భాగస్వామ్యం అనే ప్రధాన ఆదర్శాలను హైలైట్ చేస్తూ, ప్రతి పౌరుడు తమ ఆకాంక్షలను నెరవేర్చుకునేలా చేయడంలోనే స్వేచ్ఛ యొక్క నిజమైన సారం ఉందని ఆమె నొక్కి చెప్పారు.
ఇటీవల నీట్ పేపర్ లీక్ ను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో పార్లమెంట్ మార్చ్ చేపట్టిన విషయం తెలిసిందే. విద్యార్థుల ఆందోళనలతో మోడీ ప్రభుత్వం దొగొచ్చింది. ధర్మంద్ర ప్రధాన్ తన కేంద్ర విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేశారు. అదే విధంగా పోటీ పరీక్షల్లో అవకతవకలను నివారించడానికి పార్లమెంట్ లో యాంటీ పేపర్ లీక్ యాక్ట్ ను ఆమోదించారు.


