Tuesday, September 8, 2026
E-PAPER
Homeజాతీయంవిద్యార్థుల ఆందోళనను గౌరవించాలి: రాహుల్‌ గాంధీ

విద్యార్థుల ఆందోళనను గౌరవించాలి: రాహుల్‌ గాంధీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన నిరసనలో పాల్గొన్న విద్యార్థుల ఆందోళనలను అన్ని పార్టీలు గౌరవించాలని ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ కోరారు. పేపర్‌ లీక్‌ వ్యతిరేక బిల్లుపై లోక్‌సభలో జరుగుతున్న చర్చలో పాల్గొన్న రాహుల్‌గాంధీ  కేంద్రం తీరును విమర్శించారు. తాను కొందరు విద్యార్థుల నుంచి సూచనలు తీసుకున్నానని, యువత ఆందోళనలను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. తీవ్ర వేదన తర్వాతే విద్యార్థులు ఆందోళనకు దిగారన్నారు. యువత సెంటిమెంట్‌ను అన్ని పార్టీలు గౌరవించాలని రాహుల్‌ కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -