Tuesday, August 4, 2026
E-PAPER
Homeజాతీయంవిద్యార్థులపై కేసుల ఉపసంహరణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

విద్యార్థులపై కేసుల ఉపసంహరణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ :నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో నిరసనలు తెలిపిన విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను ఉపసంహరించుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే, తీవ్రమైన నేర చరిత్ర ఉన్నవారికి మాత్రం ఈ మినహాయింపు వర్తించదని తేల్చిచెప్పింది.

నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జులై 20న ఢిల్లీలో నిర్వహించిన ‘చలో సంసద్’ కార్యక్రమం సందర్భంగా విద్యార్థులపై పోలీసులు తీసుకున్న చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ అంశంపై స్పష్టతనిచ్చింది.

గతంలో తామిచ్చిన ఆదేశాల్లో పేర్కొన్న ‘నేర చరిత్ర’ అనే పదాన్ని విద్యార్థులందరికీ వర్తింపజేయలేదని, కేవలం తీవ్రమైన నేరాల్లో ప్రమేయం ఉన్నవారికి మాత్రమే అది వర్తిస్తుందని ధర్మాసనం వివరించింది. “విద్యార్థులపై అధిక బలాన్ని ప్రయోగించిన పోలీసులను వెనకేసుకురాకూడదు. అదే సమయంలో, విద్యార్థుల ముసుగులో హింసకు పాల్పడిన వారిని వదిలిపెట్టకూడదు” అని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -