నవతెలం-గాణ - హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా రాష్ట్ర మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం నుంచి ప్రారంభం కానున్న ఈ తొమ్మిది రోజుల పూల ఉత్సవాలను మహిళలందరూ ఆనందోత్సాహాల మధ్య, సంప్రదాయ పాటలు, నృత్యాలతో ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ఒక సందేశాన్ని విడుదల చేశారు.
బతుకమ్మ పండుగ తెలంగాణ విశిష్ట సంస్కృతికి అద్దం పడుతుందని, ప్రకృతిని ఆరాధించే అత్యంత గొప్ప సంప్రదాయమని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, గౌరమ్మను పూజించడం తెలంగాణ జీవన విధానంలో ఒక భాగమని ఆయన పేర్కొన్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మ వరకు సాగే ఈ వేడుకలు ప్రజల మధ్య ఐక్యతను, సామూహిక జీవన సౌందర్యాన్ని చాటిచెబుతాయని ఆయన కొనియాడారు.
తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు: సీఎం రేవంత్‌రెడ్డి
1 గంట క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది అక్టో 10, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)