Magazines

సీజేపీ నేతలకు ఐదు రోజుల జ్యుడిషియల్ కస్టడీ

1 గంట క్రితం

Five-day judicial custody for CJP leaders
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనల సందర్భంగా అరెస్టయిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు ఐదు రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. దీంతో వారిని తిహార్ జైలుకు తరలించారు. జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించిన నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించి గేట్లు, బారికేడ్లు దాటి లోపలికి ప్రవేశించారనే ఆరోపణలతో పోలీసులు మంగళవారం వారిని అరెస్ట్ చేశారు. బుధవారం స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా కస్టడీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే, ఈ అరెస్టులు అకారణమని, పోలీసులు తప్పుడు ఆరోపణలు చేశారని నేతల తరఫు న్యాయవాది అభిష్త్ హెలా పేర్కొన్నారు. మరో నేత అజింక్య షిండే వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్