నవతెలంగాణ - హైదరాబాద్ : నైజీరియాలో బెనిన్ సిటీ నుంచి లాగోస్‌కు బయలుదేరిన వైమానిక దళ విమానం ఇగ్బోకోడా వద్ద కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 25 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో సహా మొత్తం 32 మంది మరణించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తునకు ఆదేశించినట్లు దేశాధ్యక్షుడు బోలా టినుబ్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
ఘెర విమానం ప్రమాదం.. 32 మంది మృతి
46 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)