Magazines

బ్రేకప్‌ చెప్పిందని ప్రియురాలిని లోయలోకి తోసి హత్య

11 అక్టోబర్, 2026

Man murders girlfriend by pushing her into a valley after she breaks up with him.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : పెళ్లి నిశ్చయమైందని ప్రియురాలు బ్రేకప్‌ చెప్పడంతో ఆగ్రహించిన ఓ యువకుడు ఆమెను లోయలోకి తోసి హత్య చేశాడు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ జిల్లాలో అక్టోబర్‌ 9న ఈ ఘటన జరిగింది. శ్రీపాద్‌ దింకర్‌ (25), తరణ్ణుమ్‌ బషీర్‌ నాయక్‌ (23)ను లోయలోకి తోసేశాడు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఆమె కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపట్టగా నేరాన్ని అంగీకరించడంతో అతడిని అరెస్టు చేశారు. యువతి మృతదేహాన్ని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్