Magazines

వరంగల్ ఎయిర్‌పోర్టు పనుల్లో ముందడుగు

12 గంటల క్రితం

Warangal Airport
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌: వరంగల్ (మామనూరు) ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనుల్లో కీలక ముందడుగు పడింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) మొదటి దశ పనులకు టెండర్ ప్రక్రియను పూర్తి చేసి కాంట్రాక్టు సంస్థను ఖరారు చేసింది. ఎయిర్‌పోర్టుకు కొత్తగా సేకరించిన భూమికి రక్షణ గోడ (బౌండరీ వాల్) 283 ఎకరాల భూమి చుట్టూ ప్రీకాస్ట్ బౌండరీ వాల్ నిర్మించే పనులను హైదరాబాద్‌కు చెందిన సైదాక్స్ ఇంజనీర్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది.

ఈ కాంట్రాక్టును సెప్టెంబర్ 29న ఖరారు చేశారు. ఈ పనుల కోసం ఏఏఐ రూ.21.39 కోట్లను అంచనా వ్యయంగా నిర్ణయించగా, సైదాక్స్ సంస్థ కేవలం రూ.13.28 కోట్లకే పనులు పూర్తి చేస్తామని బిడ్ దాఖలు చేసింది. ఇది అంచనా వ్యయం కంటే 37.89 శాతం తక్కువ. దీనివల్ల ప్రభుత్వానికి దాదాపు రూ.8.10 కోట్లు ఆదా కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్