Magazines

మహిళలు, పిల్లల సంరక్షణే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత: సీఎం రేవంత్‌రెడ్డి

5 గంటల క్రితం

Cm Revanth Reddy
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌: డిజిటల్ యుగంలో సైబర్ నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. పిల్లల ఆన్‌లైన్ భద్రత కోసం ఒక సమగ్ర ఫ్రేమ్‌వర్క్‌ను వెంటనే రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) సౌత్ జోన్ రీజనల్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.

ఆన్‌లైన్‌లో పిల్లలు ఎక్కువ సమయం గడుపుతున్నారని, అక్కడ ఎదురయ్యే ప్రమాదాలపై వారికి సరైన అవగాహన ఉండటం లేదని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థతో సంప్రదింపులు జరిపి ఈ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని సూచించారు. మహిళలు, పిల్లల సంరక్షణే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఫ్రేమ్‌వర్క్ ద్వారా న్యాయ సేవలను రాష్ట్రంలోని ప్రతీ గ్రామానికి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్