నవతెలంగాణ–హైదరాబాద్: సోమాలియా పుంట్‌ల్యాండ్ సమీపంలో ఓ ఇంధన ట్యాంకర్‌ను మంగళవారం తెల్లవారుజామున పైరేట్లు హైజాక్ చేశారు. ట్యాంకర్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకునే క్రమంలో ముగ్గురు పాకిస్థానీయులు, ఓ భారతీయ నావికుడు, మయన్మార్‌కు చెందిన మరో వ్యక్తి మృతిచెందినట్లు సోమాలియా అధికారులు తెలిపారు.ట్యాంకర్‌లో మొత్తం 17 మంది ఉండగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పైరేట్లు వారికి చికిత్స అందించకుండా ట్యాంకర్‌ను తమ ఆధీనంలోనే ఉంచడంతో గాయపడిన ఐదుగురు మృతిచెందినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. మిగిలిన వారిని సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు.
సోమాలియా తీరంలో పైరేట్ల హైజాక్.. ఐదుగురు మృతి
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)