ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు సన్నాహం
నేడు వెస్టిండీస్‌తో తొలి వన్డే
మ. 2.00గం.ల నుంచి
తిరువనంతపురం
ఐసీసీ వన్డే ప్రపంచకప్ సన్నాహాంలో భాగంగా వెస్టిండీస్‌తో ఆదివారం జరిగే తొలి వన్డేకు సినీయర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితోపాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఫామ్‌పై అందరి దృష్టి నెలకొంది. వీరంతా వన్డే ప్రపంచకప్‌కు సిద్ధమవుతున్నారు. టెస్టు, టి20 ఫార్మాట్‌లకు గుడ్‌బై చెప్పిన విరాట్, రోహిత్ కేవలం వన్డేల్లో మాత్రమే పాల్గొంటున్నారు. మరోవైపు భారత్‌లో సుదీర్ఘ పర్యటనకు వచ్చిన విండీస్ జట్టు ఇటీవలి కాలంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ టాప్-8లో చోటు కోల్పోయి నేరుగా ఐసిసి వన్డే ప్రపంచకప్‌కు దూరమైంది. శుక్రవారం నాటి ప్రాక్టీస్ సెషన్‌లో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వేసిన బంతి గిల్ కుడి మోచేతికి బలంగా తాకింది. దీంతో మైదానంలోనే సుమారు 20 నిమిషాల పాటు అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ పరిణామంతో గిల్ ఫిట్‌నెస్‌పై ఆందోళనలు వ్యక్తమ యినప్పటికీ, గిల్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు, మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు" అని కోటక్ స్పష్టం చేశాడు. వన్డే జట్టులోకి పునరాగమనం చేసిన రవీంద్ర జడేజా అనుభవం జట్టుకు ఎంతో కీలకమని కొటక్ ప్రశంసించాడు. జడేజా అద్భుతమైన ఆల్‌రౌండర్. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ లోనూ అతను ప్రపంచస్థాయి నైపుణ్యాన్ని ప్రదర్శి స్తాడు. రోహిత్, విరాట్, జడేజా వంటి సీనియర్ల అనుభవం జట్టుకు అదనపు బలాన్నిస్తుంది అని పేర్కొన్నాడు.
జట్లు(అంచనా)
ఇండియా: శుభ్‌మన్(కెప్టెన్), కెఎల్ రాహుల్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, కోహ్లి, గైక్వాడ్, జురెల్, నితీశ్ కుమార్, జడేజా, కుల్దీప్, సిరాజ్, ప్రసిధ్/గుర్నూర్ బ్రార్.
వెస్టిండీస్: హోప్(కెప్టెన్, వికెట్ కీపర్), క్యాంప్‌బెల్, కర్టే, రూథర్డ్‌ఫోర్డ్, గ్రీవ్స్, జాంగో, ఫోర్డే, రోస్టన్ ఛేస్, మోటీ, జోసెఫ్, సెలెస్.






కామెంట్‌లు (0)