Magazines

వన్డే ప్రపంచకప్‌-2027 చివరిది: విరాట్‌ కోహ్లీ

49 నిమిషాల క్రితం

ODI World Cup
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ 2027 వన్డే ప్రపంచకప్‌పై దృష్టి సారించారు. తన కెరీర్‌లో భారత జట్టు తరఫున ఆడబోయే చివరి ప్రపంచకప్‌ ఇదేనని కోహ్లీ పేర్కొన్నారు. దేశం తరఫున చివరిసారిగా ప్రపంచకప్‌లో పాల్గొనడం కంటే తనకు మరో పెద్ద ప్రేరణ అవసరం లేదని చెప్పారు.


వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌కు ముందు కోహ్లీ తన ప్రపంచకప్‌ సన్నద్ధతపై మాట్లాడారు. ప్రపంచకప్‌ను గెలవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. టోర్నీలో జట్టు ఎంత దూరం వెళ్లినా, అందుకు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్