Magazines

బంగారం రూ.2600 తగ్గుదల

1 గంట క్రితం

Gold price drops by Rs. 2,600.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : బంగారం ధరల్లో భారీ తగ్గుదల చోటు చేసుకుంది. సోమవారం న్యూఢిల్లీ బులియన్‌ ‌మార్కెట్‌‌లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.2,600 పతనమై రూ. 1.5 లక్షలుగా నమోదయ్యింది. ఇదే బాటలో వెండి కూడా తగ్గింది. అన్ని రకాల పన్నులతో కలిపి కిలో వెండిపై రూ.5,000 పడిపోయి రూ. 2.32 లక్షలుగా పలికిందని బులియన్‌ ‌వర్గాలు తెలిపాయి. కాగా.. హైదరాబాద్‌ ‌మార్కెట్‌‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.2,510 తగ్గి రూ.1,50,170గా పలికింది. 22 క్యారెట్లపై రూ.2300 దిగివచ్చి రూ.1,37,650 వద్ద నమోదయ్యింది. 10 గ్రాముల వెండిపై రూ.50 తగ్గి రూ.2450గా చోటు చేసుకుంది. అమెరికా డాలర్ బలపడటం పసిడి, వెండి ధరలపై ఒత్తిడి తెస్తోందని లెమన్ బ్రోకింగ్ రీసెర్చ్ హెడ్ గౌరవ్ గర్గ్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 128.93 డాలర్లు లేదా 3.01 శాతం క్షీణించి 4,156.44 డాలర్లకు పడిపోయింది. వెండి కూడా ఔన్సుకు 2.96 డాలర్లు లేదా 4.6 శాతం తగ్గి 61.34 డాలర్ల వద్ద నమోదయ్యింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్