Magazines

డిజైనర్ ధ్రువ్ కపూర్‌తో కలిసి మిలన్ ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన సెన్నెస్  

1 గంట క్రితం

Dhruv Kapoor
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - మిలన్: సెన్కో సంస్థకు చెందిన ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ బ్రాండ్ అయిన సెన్నెస్, సెప్టెంబర్ , 2026 మంగళవారం నాడు జరిగిన మిలన్ ఫ్యాషన్ వీక్‌లో డిజైనర్ ధ్రువ్ కపూర్ షోకు జ్యువెలరీ భాగస్వామిగా ర్యాంప్  పై మెరిసింది. ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన ఫ్యాషన్ వీక్‌లలో ఒకటైన మిలన్‌కు తన ప్రత్యేకమైన ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీని తీసుకురావడంతో, 2026 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న తర్వాత సెన్నెస్‌కు ఈ భాగస్వామ్యం మరో అంతర్జాతీయ మైలురాయిగా నిలిచింది.


మిలన్ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా సెన్నెస్ యొక్క 'టాయ్ ఎట్ మోయ్ బై సెన్నెస్'  కలెక్షన్ నిలిచింది.  ఫ్రెంచ్‌లో "నువ్వు - నేను" అని అర్థం వచ్చే టోయ్ ఎట్ మోయ్, రెండు వేర్వేరు రంగుల ల్యాబ్-గ్రోన్ వజ్రాలు తమ వ్యక్తిగత ప్రత్యేకతలను నిలుపుకుంటూనే మిలిత మవటం ఆధారంగా రూపొందించబడింది.  ఈ కలెక్షన్‌లోని నెక్లెస్‌లు, చెవిపోగులు, ఉంగరాలు, పెండెంట్లు మరియు బ్రాస్‌లెట్‌లతో సహా సుమారు 71 ఆభరణాలు  రన్‌వేపై ఐదు విభిన్న లుక్స్‌లో ప్రదర్శించబడ్డాయి.

సెన్నెస్ మరియు సెన్కో గోల్డ్ & డైమండ్స్ సంస్థల డైరెక్టర్, మార్కెటింగ్ & డిజైన్ హెడ్ - జోయిటా సేన్ మాట్లాడుతూ  టోయ్ ఎట్ మోయ్ ద్వారా రెండు విభిన్న అంశాలు ఒకదానిని మరొకటి కప్పివేయకుండా ఎలా కలిసి రాగలవో చూపించామన్నారు. ధ్రువ్ కపూర్‌తో సెన్నెస్‌కు ఉన్న అనుబంధం కారణంగా తమ బ్రాండ్‌కు తమ డిజైన్ అభిరుచులను ప్రదర్శించడానికి మరో ప్రపంచ వేదికను అందించిందన్నారు . 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్