Magazines

రాజన్న ఆలయాన్ని దేశవ్యాప్త ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: మంత్రి పొన్నం

52 నిమిషాల క్రితం

Rajanna temple
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

భక్తుల సౌకర్యాలే కేంద్రంగా సమగ్ర అభివృద్ధి: మంత్రి పొన్నం ప్రభాకర్

నవతెలంగాణ–వేములవాడ

దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ భీమేశ్వరాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, విజయరమణారావు, వేముల వీరేశం మంగళవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వేములవాడను తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వేములవాడతో పాటు భద్రాద్రి, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం తదితర ప్రముఖ ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోందన్నారు.

వేములవాడ రాజన్న ఆలయం కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి అంటే కేవలం నిర్మాణాలు
చేపట్టడం కాదని, భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, అన్నదాన సత్రం, గోశాల, వసతి, పార్కింగ్, తాగునీరు, పారిశుద్ధ్యంతో పాటు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడమేనన్నారు. గతంలో ఆలయ అభివృద్ధి కోసం ప్రజలు, భక్తులు చేసిన పోరాటాలను ప్రభుత్వం గౌరవిస్తోందన్నారు. పెండింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా, నాణ్యతలో రాజీ లేకుండా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాజన్న స్వామి ఆశీస్సులు తెలంగాణ ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్