Magazines

జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ

51 నిమిషాల క్రితం

Congress Working Committee
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) డిమాండ్ చేసింది. మంగళవారం నాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రధాన కార్యాలయంలో పలు తీర్మానాలను ఆమోదించింది. ఓటర్ల జాబితాల 'ప్రత్యేక సమగ్ర సవరణ' (SIR) ప్రక్రియను నిలిపివేయాలని, జాబితా నుండి తొలగించబడ్డా 13 కోట్ల 30 లక్షల మంది పేర్లను తిరిగి చేర్చాలని తీర్మానం చేసింది. ప్రస్తుత CEC ఆధ్వర్యంలోని భారత ఎన్నికల సంఘం (ECI) మద్దతుతో RSS-BJP ఎన్నికల ప్రక్రియను తమ గుప్పిట్లోకి తీసుకుందని కాంగ్రెస్ విమర్శించింది. సీఈసీ తీరుతో ప్రజాస్వామ్యానికి వాటిల్లిన తీవ్ర ముప్పుపై చర్చించేందుకు తాము సమావేశమయ్యామని CWC పేర్కొంది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్