Magazines

రీసైకిల్ వస్తువుల సేకరణతో విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన

47 నిమిషాల క్రితం

kapra
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ _ కాప్రా

స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో భాగంగా కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీంద్ర సాగర్ ఆదేశాల మేరకు ‘స్వచ్ఛతా హి సేవ’ కార్యక్రమాన్ని కుషాయిగూడలోని వి.ఎన్.రెడ్డి కాలనీ ప్రగతి విద్యాలయ పాఠశాలలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నుంచి రీసైకిల్ చేయగల వ్యర్థ వస్తువులను సేకరించి వాటి పునర్వినియోగం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో మాట్లాడిన డిప్యూటీ కమిషనర్ రవీంద్ర సాగర్, ప్లాస్టిక్, కాగితం, లోహ వస్తువులు వంటి రీసైకిల్ చేయగల పదార్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా, డ్రైనేజీలు, నాళాల్లో వేయకుండా స్క్రాప్ వ్యాపారులకు లేదా రీసైక్లింగ్ కేంద్రాలకు అందించాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజారోగ్యం, పారిశుద్ధ్య పరిరక్షణకు తోడ్పడవచ్చని తెలిపారు.

నగరాన్ని పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ సుదర్శన్, ఎస్‌ఎఫ్‌ఏ కె.లక్ష్మి, పాఠశాల ప్రిన్సిపాల్ కవితా సింగ్, ఉపాధ్యాయులు కల్పన, నీతు, శిరీషతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్