Magazines

పాఠశాల ముందు ప్రమాదభరితంగా గుంత 

46 నిమిషాల క్రితం

pothole
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

విద్యార్థులకు ప్రమాదం జరిగినా పట్టించుకోని పాఠశాల యాజమాన్యం 

నవతెలంగాణ-నవాబుపేట
మండల పరిధిలోని కిషన్ గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని గుబ్బడిగుచ్చ తాండా ప్రాథమిక పాఠశాల ఆవరణలో అదనపు గదుల నిర్మాణం కోసం తీసిన గుంతలు పాఠశాల విద్యార్థులకు ప్రాణసంకటంగా మారింది. అక్కడ చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అక్కడ కాంట్రాక్టర్ పనులను అర్థాంతరంగా ఆపడంతో పెద్దపెద్ద గుంతలు ఉన్నాయి. గతకొన్ని రోజుల క్రితం ఓ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి అని గొడవలు కూడా అయినట్లు సమాచారం. వెంటనే గుంతలు పూడ్చి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని తాండా వాసులు అంటున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్