Magazines

జర్నలిస్టుల ఇండ్ల కళకు మరింత ఊతం!

1 గంట క్రితం

journalists' homes!
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

వర్కింగ్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ చైర్మన్‌గా లాయక్ పాషా ఏకగ్రీవం..
నవతెలంగాణ–వేములవాడ

వేములవాడ వర్కింగ్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ చైర్మన్‌గా లాయక్ పాషా ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ప్రెస్‌క్లబ్ కార్యవర్గం ఈ మేరకు తీర్మానం చేసింది. ఈ సందర్భంగా లాయక్ పాషా మాట్లాడుతూ.. ఇప్పటికే మంజూరైన జర్నలిస్టుల నివాస స్థలాలతో ఏర్పడుతున్న కాలనీ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనతో పాటు మిగిలిన అర్హులైన జర్నలిస్టులకు స్థలాల సాధనకు కృషి చేస్తానని తెలిపారు.

మున్సిపల్ పరిధిలోని ఆరో వార్డులోని సర్వే నంబర్‌ 391లో మంజూరైన స్థలాలను పూర్తి స్థాయి కాలనీగా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. రహదారులు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి సదుపాయాలపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. కాలనీలో బొడ్రాయి ఏర్పాటు, ఇంటి నంబర్‌ తీసుకోవడంతో పాటు విద్యుత్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు.

కాలనీలో నీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం అందించగా రెండు బోరుబావుల మంజూరుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. గతంలో సుమారు 60 మంది జర్నలిస్టులకు స్థలాల సాధనలో భాగస్వామ్యమైన లాయక్ పాషా.. మిగిలిన అర్హులకు కూడా స్థలాలు వచ్చేలా కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో జర్నలిస్టుల సంక్షేమం కోసం ముందుకు సాగుతానని తెలిపారు. లాయక్ పాషా నియామకంపై పలువురు జర్నలిస్టులు, న్యాయవాదులు, ప్రముఖులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్