Magazines

రేపు మాంసాహార విక్రయాలు నిషేదం

1 గంట క్రితం

Ban on meat
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

కుభీర్ గ్రామపంచాయతీ కార్యదర్శి జాదవ్ మాధవ్

నవతెలంగాణ-కుభీర్

జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న కుభీర్ గ్రామపంచాయతీ పరిధిలో మటన్, చికెన్ తదితర మాంసాహార పదార్థాల విక్రయాలను నిర్వహించరాదని గ్రామపంచాయతీ కార్యదర్శి జాదవ్ మాధవ్ సూచించారు. గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఆయన తెలిపారు. అక్టోబర్ 2న మాంసం విక్రయ కేంద్రాలను తెరిచి మటన్, చికెన్ విక్రయాలు జరిపినట్లు గుర్తిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాంసం విక్రయదారులు ఈ విషయాన్ని గమనించి అక్టోబర్ 2న తమ దుకాణాలను మూసివేసి గ్రామపంచాయతీకి సహకరించాలని కోరారు. ప్రజలు కూడా ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ గాంధీ జయంతిని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కార్యదర్శి మాధవ్ విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్