నవతెలంగాణ - భీంగల్
భీంగల్ మండలం జాగీర్యాల్ ప్రైమరీ స్కూల్ ప్రైవేట్ టీచర్ కు తన గౌరవ వేతనాన్ని గురువారం సర్పంచ్ గడల ప్రసాద్ అందజేశారు. ప్రైమరి స్కూల్ లో కమ్యూనికేషన్స్ స్కిల్స్, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం ప్రైవేటుగా టీచర్ ని అపాయింట్ చేసి ఆ ప్రైవేట్ టీచర్ కి సర్పంచ్ తన నెల గౌరవ వేతనాన్ని చిన్నోళ్ల నిఖిలకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిన్నోళ్ల రాజేశ్వర్, వీడీసీ సభ్యులు పెద్దోళ్ల లింగం, స్కూల్ స్టాప్ మెంబర్స్ పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)