Magazines

రైస్ మిల్లులో అధికారుల ఆకస్మిక తనిఖీలు..

32 నిమిషాల క్రితం

rice mil
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

- భారీగా ధాన్యం కొరత గుర్తింపు

నవతెలంగాణ -ముధోల్ : భైంసా మండలం వానల్‌పాడ్ గ్రామంలోని పల్లవి మోడర్న్‌ రైస్‌ మిల్లులో శనివారం రెవెన్యూ, పౌర సరఫరాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ప్రభుత్వనిబంధనల ప్రకారం మిల్లుకు కేటాయించిన ధాన్యం నిల్వలు, రికార్డుల్లో నమోదైన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మిల్లుకు ప్రభుత్వం కేటాయించిన మొత్తం ధాన్యం 6,102.08 మెట్రిక్‌ టన్నులు కాగా, లెక్కల ప్రకారం ప్రస్తుతం మిల్లులో 5,904.435 మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వ ఉండాల్సి ఉంది. అయితే అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించగా కేవలం 79.44 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే లభ్యమైంది.దీంతో మిల్లులో 5,824.995 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ ధాన్యం నిల్వలకు సంబంధించి ఇంత భారీ వ్యత్యాసం గుర్తించడంతో అధికారులు అక్కడికక్కడే పంచనామా నిర్వహించి, ధాన్యం నిల్వలు, రికార్డులకు సంబంధించిన వివరాలను నమోదు చేశారు.ధాన్యం నిల్వల్లో గుర్తించిన భారీ వ్యత్యాసంపై సమగ్ర నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు అధికారులుతెలిపారు. బాధ్యులైన రైస్‌ మిల్లర్‌పై క్రిమినల్‌ కేసునమోదుచేసేందుకుచర్యలుచేపట్టనున్నట్లు వెల్లడించారు.తనిఖీల సమయంలో రైస్‌మిల్లర్‌అందుబాటులో లేకపోగా, పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ధాన్యం అక్రమంగా పక్కదారి పట్టించిన అంశంపై నిబంధనల ప్రకారం తదుపరి చర్యలుతీసుకోనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్