నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సీతాఫల్‌మండి (GDC Sitaphalmandi)లో చరిత్ర విభాగం మహిళా సాధికారత కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బంగ్లా భారతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం, మహిళల హక్కులు సాధికారతకు ఆమె అందించిన స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర, ఆమె పోరాట స్ఫూర్తి మరియు మహిళా సాధికారతలో ఆమె పాత్ర పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చాకలి ఐలమ్మ ఆశయాలను, ఆమె ధైర్యసాహసాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని కార్యక్రమంలో వక్తలు సూచించారు.
కార్యక్రమంలో కళాశాల IQAC కోఆర్డినేటర్ డా. కె. జైపాల్, డా. ఎం.రాజు, బి. వెంకటేష్ (NSS PO), డా.సుధ, డా.సరోజ, సమతావాణి, బి.రాజిని, విమలాదేవి, డా.ఎస్. కిషోర్, స్వప్న, సాయికుమార్ తదితర బోధనా సిబ్బంది పాల్గొన్నారు. అలాగే కళాశాల బోధనేతర సిబ్బంది జె.శిల్ప, ఈశ్వరి, వినోద్, శ్రీనివాస్, రామకృష్ణ, ఇన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)