Magazines

చంద్రగట్టు కోట అభివృద్ధి పనులకు భూమి పూజ

1 గంట క్రితం

kota works
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - ఆత్మకూర్ 

అమరచింత మండల పరిధిలోని చంద్రగట్టులోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శనివారం తెలంగాణ టాడీ టాపర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ కేశం నాగరాజ్ గౌడ్, స్థానిక సర్పంచ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చంద్రగట్టు కోటలో రూ. 25 లక్షల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కేశం నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ.. మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో కోట అభివృద్ధి పనుల కోసం రూ. 25 లక్షలు మంజూరయ్యాయన్నారు. మంత్రి సహకారంతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అభివృద్ధే ధ్యేయంగా మంత్రి ముందుకు వెళ్తున్నారని తెలిపారు.


ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి రమేష్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, ఆత్మకూర్ టౌన్ అధ్యక్షుడు రవికాంత్, నాయకులు జింక రవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కమలాకర్ గౌడ్, కో ఆప్షన్ సభ్యుడు తౌఫిక్, నాయకులు సర్వారెడ్డి, శివారెడ్డి, సుధాకర్ రెడ్డి, ప్రభాకర్, పూజారులు చంద్రశేఖర్, నగేష్ స్వామి, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్