నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
ఈనెల సెప్టెంబర్ 23 నుండి 25 వరకు సిద్దిపేటలో జరిగిన జిల్లాస్థాయి ఎస్ జి ఎఫ్ గేమ్స్ లో హుస్నాబాద్ కు చెందిన కేరళ ఇ/మీ హై స్కూల్ విద్యార్థులు కబడ్డీ ఫైనల్ లో మొదటి స్థానం పొందారు. అండర్ 17 బాలుర కబడ్డీ విభాగం లో పి.రత్నకీర్తన్, సాత్విక్ గోల్డ్ మెడల్ పొందగా, అండర్ 17 బాలికల కబడ్డీ విభాగంలో ఫైనల్ లో ద్వితీయ స్థానంలో బి.స్వస్తిక సిల్వర్ మెడల్ సాధించినట్లు పాఠశాాల చైర్మన్ ,ప్రిన్సిపల్ బుర్ర రాజేందర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్రీడల్లో రాణించిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.ఈ కార్యక్రమంలో సెక్రటరీ, కరెస్పాండెంట్ అల్లే శైలేందర్, వీటి వంశీ, ఉపాధ్యాయులు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.






కామెంట్‌లు (0)