Magazines

ప్రజాస్వామ్య వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన

1 గంట క్రితం

acpt
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం

అభినందించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

నవతెలంగాణ-అచ్చంపేట

పట్టణంలోని పీఎం శ్రీ గవర్నమెంట్ హైస్కూల్‌లో విద్యార్థులు మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ హాజరై మాట్లాడుతూ.. మాక్ పార్లమెంట్ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ప్రజాస్వామ్యంపై అవగాహన పెంచడంతో పాటు, నాయకత్వ లక్షణాలు, చర్చించే నైపుణ్యం, సమస్యలను విశ్లేషించే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు.


భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ విలువలు, ప్రజాప్రతినిధుల బాధ్యతలను విద్యార్థులు తెలుసుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదిగి సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్