నవతెలంగాణ-మర్రిగూడ
మండల కేంద్రంలో శనివారం రజక సంఘం ఆధ్వర్యంలో వీరనారి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలువురు ఆమె విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి భూమికోసం భుక్తి కోసం విముక్తి కోసం ఆమె చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మర్రిగూడ ఎస్ఐ రాంబాబు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య, మాజీ జడ్పీటీసీ మేతరీ యాదయ్య, పగడాల లింగయ్య, కొలుకులపల్లి యాదయ్య, మాజీ సర్పంచ్ మాస నీలిమ చంద్రశేఖర్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, జిల్లా తిరుమలేష్, పాత్లావత్ రాజేందర్ నాయక్, పుప్పాల యాదయ్య, పగడాల రఘు, సత్తిరెడ్డి, రజక సంఘం నాయకులు, ఆయా గ్రామాల సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)