Magazines

విజయవంతంగా గణేశ్ శోభాయాత్రలు: సీపీ సజ్జనార్

1 గంట క్రితం

CP Sajjanar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: భాగ్యనగరంలోని నాలుగు కమిషనరేట్‌లలో విజయవంతంగా గణేశ్ శోభాయాత్రలు ముగిశాయని హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) వ్యాఖ్యానించారు. ఈ వేడుకకు సహకరించిన అన్నిశాఖల అధికారులను అభినందించారు. హోం గార్డ్ నుంచి ఐపీఎస్ అధికారుల వరకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు (శనివారం) హైదరాబాద్‌లో మీడియాతో సీపీ సజ్జనార్ మాట్లాడారు. హైదరా‌బాద్‌ కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా శోభాయాత్రలు జరిగాయని వెల్లడించారు.


30 లక్షలకు పైగా భక్తులు ఖైరతాబాద్ గణేశ్‌ను దర్శించుకున్నారని చెప్పారు. బాలాపూర్ లంబోదరుడిని 15 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని వెల్లడించారు. శోభాయాత్రలో కలర్ పేపర్‌తో చాలా ఇబ్బంది అవుతోందని.. వచ్చేసారి వీటిని బ్యాన్ చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. శోభాయాత్రలో అల్లరి చేసిన మందుబాబులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీస్ అధికారులు ఈ వేడుక కోసం 48 గంటల పాటు నిద్ర లేకుండా పనిచేశారని సీపీ సజ్జనార్ కొనియాడారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్