నవతెలంగాణ-మద్నూర్
మండలంలోని మూడు రాష్ట్రాల సరిహద్దుల గల ప్రఖ్యాతిగాంచిన సలాబత్పూర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రౌతు వార్ అనిల్ పటేల్ అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. శనివారం ఆయన అంత్యక్రియలు మద్నూర్ మండల కేంద్రంలో శనివారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎస్సీ సెల్ నాయకులు సౌదాగర్ అరవింద్ పాడే రైతువార్ అనిల్ పటేల్ పాడె మోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మృతుని తండ్రి వేద్ ప్రకాష్ పాటిల్ రెండు పర్యాయాలు గ్రామ సర్పంచిగా పనిచేశారని గుర్తు చేశారు. ఆయన మృతి చెందిన కొన్నిరోజులకే కొడుకు మృతి చెందడం బాధాకరమన్నారు.






కామెంట్‌లు (0)