నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని తడిహిపర్గా గ్రామంలో ఎంపీడీఓ సత్యనారాయణ కొత్త పెన్షన్ల దరఖాస్తులను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. అర్హులైణ ప్రతి ఒక్కరికీ పెన్షన్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సర్పంచ్ అశ్విని సుదర్శన్ మున్నా మాట్లాడుతూ.. ఆసరా, చేయూత పెన్షన్ల దరఖాస్తులను అర్హులైన వారి నుండి సేకరించామని చెప్పారు. ప్రజాపాలన ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష‍్యంగా ముందుకు వెళ్తోందని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ జ్యోతి, సర్పంచ్, లబ్దిదారులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)