Magazines

ఎల్‌నినో ప్రభావం.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన

1 గంట క్రితం

MAHARASHTRA
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: సూపర్ ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది దేశంలో తీవ్ర వర్షాభావం ఏర్పడింది.ఈ నేపథ్యంలో కరవు ప్రభావిత ప్రాంతాలును మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని 358 తాలూకాల్లో 265 తాలూకాలను కరవు ప్రభావిత ప్రాంతాలు వెల్లడించింది.ఆ రాష్ట్రంలోని దాదాపు 74 శాతం తాలూకాలు కరవు ప్రభావానికి గురైనట్లు ప్రభుత్వం గుర్తించింది. శనివారం జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఈ ప్రకటన వెలువడింది.


మహారాష్ట్రలో సాధారణంగా 932.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఈసారి 755.9 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 18.8 శాతం వర్షపాతం లోటు ఏర్పడింది.


ముఖ్యంగా మరాఠ్వాడా ప్రాంతంలోని పలు జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఛత్రపతి సంభాజీనగర్ డివిజన్‌లో సాధారణ వర్షపాతం 613.1 మిల్లీమీటర్లు కాగా.. ఈసారి కేవలం 424.5 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. దీంతో అక్కడ ఏకంగా 30.8 శాతం వర్షపాతం లోటు నమోదైంది.


ధారాశివ్, బీడ్ జిల్లాలు పుణె, నాసిక్ అమరావతి, సోలాపూర్, లాతూర్ వంటి జిల్లాల్లో సాధారణం కంటే 40 నుంచి 50 శాతం వరకు తక్కువ వర్షపాతం నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్