క్షేత్ర స్థాయిలో కష్టపడి విధులు నిర్వర్తించిన అదికారులు, సిబ్బందిని అభినందించిన ఎస్పీ
నవతెలంగాణ-జగిత్యాల టౌన్
ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమిష్టి కృషితో నిమజ్జనాన్ని ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లాలో 3500 పైగా గణేష్ మండపాల నుండి విగ్రహాలు శాంతియుత వాతావరణంలో నిమజ్జనం చేయబడ్డాయిని నిమజ్జన ప్రాంతాల్లో పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్, అగ్నిమాపక, ఆరోగ్యశాఖలు సిబ్బంది సహకారంతో సమన్వయంగా పనిచేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదని ఎస్పీ అన్నారు.
గడిచిన 11 రోజులపాటు 24 గంటలు పని చేసిన పోలీస్ అధికారులు, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది యొక్క కృషి వల్లనే గణేష్ ఉత్సవాలను విజయవంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకున్నామని దీనికి కృషి చేసిన పోలీస్ అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. అదేవిధంగా నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్‌జెండర్ ల, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు సక్రమంగా విధులు నిర్వర్తించి తమ వంతు పాత్ర పూర్తి చేసినందుకు అభినందనలు తెలియజేశారు. జిల్లా ప్రజలు, మండపాల నిర్వాహకుల సహకారం వల్ల గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ సాఫీగా ముగిసిందని ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, మండపాల నిర్వాహకులకు ఎస్పీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోవు రోజుల్లో జరిగే పండుగలను ఇదే స్ఫూర్తితో జరుపుకోవాలని కోరారు.






కామెంట్‌లు (0)