Magazines

బాల్కొండలో చిట్యాల ఐలమ్మ 131వ జయంతి ఉత్సవాలు

2 గంటల క్రితం

ailamma
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-బాల్కొండ 

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన ధీర మహిళ చిట్యాల ఐలమ్మ 131వ జయంతి ఉత్సవాలను శనివారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కుల పెద్ద మీర చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బాల్కొండ ఉపసర్పంచ్ గాండ్ల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు కుందారపు శ్రీనివాస్ పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాగీర్దారీ వ్యవస్థ, దొరల అణచివేత, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా చిట్యాల ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. తన భూమిని జమీందార్లకు అప్పగించకుండా ధైర్యంగా కాపాడుకోవడం ద్వారా రైతుల్లో పోరాట స్ఫూర్తిని నింపారని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం మహిళలు కూడా ముందుండగలరని ఐలమ్మ జీవితం నిరూపించిందన్నారు. కార్యక్రమంలో కుల సభ్యులు సుబ్బన్న, అశోక్, రాజేష్, సురేష్, కిషన్, రాజన్న, కిరిటీ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్