Magazines

TGTET ఇన్-సర్వీస్-2026 ఫలితాలు రిలీజ్

1 గంట క్రితం

Results
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్- సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన ‘తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష’ (TGTET-Inservice Teachers-2026) ఫలితాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, TGTET ఛైర్పర్సన్ శనివారం విడుదల చేశారు. జులై 21న వెలువడిన నోటిఫికేషన్ ఆధారంగా, సెప్టెంబర్ 8, 9 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షగా (CBT) మూడు విడతల్లో ఈ ఆన్ లైన్ పరీక్షలను నిర్వహించారు.


మొత్తం 24,986 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 22,477 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 15,749 మంది అర్హత సాధించి, రాష్ట్ర వ్యాప్తంగా 70.07 శాతంతో విశేష ఉత్తీర్ణత నమోదు చేశారు. ఈ పరీక్షలో పేపర్-1కు 4,942 మంది హాజరు కాగా 3,398 మంది (68.76%) ఉత్తీర్ణులయ్యారు. అలాగే పేపర్-2 (గణితం & సైన్స్) విభాగంలో 9,131 మందికి గాను 6,720 మంది (73.60%), పేపర్-2 (సోషల్ స్టడీస్) విభాగంలో 8,404 మందికి గాను 5,631 మంది (67.00%) అర్హత సాధించారు. అభ్యర్థులు తమ ఫలితాలను విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ (https://schooledu.telangana.gov.in) తో పాటు సమీపంలోని మీ-సేవ కేంద్రాల ద్వారా మార్కుల వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్