నవతెలంగాణ - తొగుట
పోషకాహారంతోనే తల్లులు, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని సర్పంచ్ బండారి కవిత స్వామి గౌడ్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శ్రీలేఖ అన్నారు. మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో పోషణ మాసం సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలకు పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.
ఇద్దరు ఆడపిల్లలు ఉన్న కుటుంబాలను ప్రోత్సహిస్తూ బేటీ బచావో - బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా గుర్తించారు. అనంతరం గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, పోషణ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవీందర్, అంగన్‌వాడీ టీచర్లు వీణ, స్వప్న, జ్యోతి, ఆశా కార్యకర్తలు వినోద, భాగ్యలక్ష్మి, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)