నవతెలంగాణ – అశ్వారావుపేట
స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా మండలంలోని నారాయణపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం పంచాయతీ పారిశుధ్య సిబ్బందికి వైద్య శిబిరం నిర్వహించారు. సర్పంచ్ మడకం కుమారి ఆంధ్రయ్య, ఉపసర్పంచ్ ఆకుల శీను, పంచాయతీ కార్యదర్శి క్రాంతికుమార్ ఆధ్వర్యంలో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం సేవలందిస్తున్న పారిశుధ్య సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనే ఉద్దేశంతో బీపీ, షుగర్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. ఏఎన్ఎంలు శాంతి కుమారి, బండారి వెంకటలక్ష్మి సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)