Magazines

అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు

1 గంట క్రితం

mla jaare
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 2 నిమిషాల చదవడం

- సమన్వయంతో విజయవంతం చేయాలి

- ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

నవతెలంగాణ - అశ్వారావుపేట

అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో ఈ నెల 10, 11, 12 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అధికారులను ఆదేశించారు. క్రీడాకారులు, నిర్వాహకులు, ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. పోటీల ఏర్పాట్లపై శనివారం అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులు, క్రీడా కమిటీ ప్రతినిధులు, నిర్వాహకులు, ప్రజాప్రతినిధులతో వేర్వేరు గా సమీక్ష సమావేశం నిర్వహించారు. క్రీడా ప్రాంగణం, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, భద్రత, వైద్య సదుపాయాలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై సమీక్షించారు.


వివిధ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులకు అవసరమైన వసతులు కల్పించడంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కబడ్డీ పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు, క్రీడా కమిటీలు, నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణతో అశ్వారావుపేటకు క్రీడా రంగంలో గుర్తింపు లభించే అవకాశం ఉందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు.


ప్రేక్షకులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వైద్య సిబ్బంది, ప్రథమ చికిత్స సదుపాయాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొననున్న నేపథ్యంలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.


సమావేశంలో మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబు,కౌన్సిలర్లు కట్ట సింధుజ, దండబత్తుల ఆదిలక్ష్మి, కారం కనకదుర్గ,అట్టం రమ్య, మిండా హరిబాబు, నార్లపాటి మహేష్, నార్లపాటి దివాకర్, తిరుమలశెట్టి వెంకన్నబాబు, మోర్ల రాజేశ్వరి, కొట్టే నాగసునీత, ఎస్‌కే రెహనా, ఎస్‌కే నూర్జహాన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిన్నంశెట్టి సత్యనారాయణ, జిల్లా జనరల్ సెక్రెటరీ కోలా లక్ష్మీనారాయణ, తుమ్మ రాంబాబు,మైనార్టీ మండల అధ్యక్షుడు కరీం, అధికారులు, క్రీడా కమిటీ సభ్యులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

stete games

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్