Magazines

తెలంగాణ నిప్పు కణిక 'వీరనారి ఐలమ్మ' ఆశయాలను కొనసాగించాలి

1 గంట క్రితం

ailamma
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 2 నిమిషాల చదవడం

- బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్

- మున్సిపల్ చైర్ పర్సన్ రెహానా కమల్ 

- సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు

- సత్తుపల్లిలో ఘనంగా ఐలమ్మ 131వ జయంతి 

నవతెలంగాణ-సత్తుపల్లి 

 తెలంగాణ నిప్పు కణిక,  రైతాంగ పోరాట వీరనారి, ధీరవనిత ఐలమ్మ 131వ జయంతి వేడుకను సత్తుపల్లి పట్టణంలోని మెయిన్ రోడ్డులోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆమె విగ్రహం వద్ద శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణవరపు శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ రెహానా కమల్, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు  నాయకులు మోరంపూడి పాండురంగారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బీసీ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు ఉప్పు హనుమంతరావు అధ్యక్షతన జరిగిన ఐలమ్మ జయంతి సభలో శ్రీనివాస్, రెహానా కమల్, పాండురంగారావు మాట్లాడారు. చాకలి ఐలమ్మ కేవలం ఒక కులానికో లేదా వర్గానికో పరిమితమైన నాయకురాలు కాదని, అన్యాయానికి, దొరల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ధైర్యానికి ప్రతీక అని కొనియాడారు. తెలంగాణ రైతాంగ హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బీసీలు, పేదలు, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు మహిళలకు, యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. ఆమె పోరాట చరిత్రను, సేవా నిరతిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.


​ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు దుస్సా వెంకటేశ్వర్లు, మరీదు ప్రసాద్, కోమటి తిరుమలరావు, తమ్మిశెట్టి గణేష్, దేవళ్ల శ్రీను, కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ కమల్ పాషా, కంటే అప్పారావు, సీపీఐ(ఎం) నాయకులు కొలికపోగు సర్వేశ్వరరావు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘ నాయకులు గుండాల కృష్ణయ్య, మాల మహానాడు నాయకులు పిల్లి మల్లికార్జున్, సామెల్, ఎమ్మార్పీఎస్, జనసేన నాయకుడు అప్పారావు, చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ మురళి, రజక సంఘ నాయకులు సాయి శ్రీను, కోట సత్యనారాయణ, టోపీ శ్రీను, చెన్నారావు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్