Magazines

'టీజీఎస్ఆర్‌టీసీ'లో మొదలైన 'ఎన్నికల' సందడి

1 గంట క్రితం

'TGSRTC'
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 2 నిమిషాల చదవడం

- ఎస్‌డబ్ల్యూఎఫ్, టీఎంయూ, ఐఎన్‌టీయూసీ

- కూటమి పొత్తు ఖరారు

- అక్టోబర్ 9న ఎన్నికలు 

నవతెలంగాణ-సత్తుపల్లి 

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్‌టీసీ)లో ఎన్నికల సందడి మొదలైంది. అక్టోబర్ 9న జరగనున్న ఆర్టీసీ గుర్తింపు సంఘ ఎన్నికల్లో సంస్థలోని ప్రధాన కార్మిక సంఘాలైన ఎస్‌డబ్ల్యూఎఫ్, టీఎంయూ, ఐఎన్‌టీయూసీ సమన్వయ కూటమి పొత్తు ఖరారైంది. ఆయా సంఘాలకు చెందిన ముఖ్య నాయకులు గురువారం సత్తుపల్లిలోని రావి వీర వెంకయ్య (ప్రజాసంఘాల) భవనంలో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. అక్టోబర్ 9న జరగనున్న ఆర్టీసీ గుర్తింపు సంఘ ఎన్నికల్లో ఈ మూడు సంఘాలు సమన్వయ కూటమిగా ఏర్పడి పోటీ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.

హక్కుల పరిరక్షణ, సంక్షేమమే ధ్యేయంగా కూటమి పనిచేస్తుంది.

సమన్వయ కూటమి సమావేశంలో ఆయా సంఘాలకు చెందిన నాయకులు మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ, సంక్షేమమే ధ్యేయంగా ఈ మూడు సంఘాలు సమన్వయంతో కలిసి ముందడుగు వేస్తాయని  నాయకులు స్పష్టం చేశారు. కార్మికులందరూ ఐక్యంగా ఉండి సమన్వయ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కూటమి నాయకులు  పిలుపునిచ్చారు. 

ఎన్నికల గుర్తులు ఖరారు

కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆయా సంఘాలకు చెందిన నాయకులు గుర్తులను ఖరారు చేశారు. ​రీజియన్ గుర్తింపు కోసం 'నక్షత్రం' గుర్తుకు ఓటు వేయాలని, అలాగే రాష్ట్ర స్థాయి గుర్తింపు కోసం 'విల్లు-బాణం' గుర్తుపై ఓటు వేసి గెలిపించుకోవాలని  తీర్మానించారు.

ఈ సమావేశంలో టీఎంయూ ప్రధాన కార్యదర్శి జి. మల్లికార్జున్, అధ్యక్షుడు వి.వి. రమణ, ఎస్‌డబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎన్. దొరబాబు, కోశాధికారి వి. ప్రభాకర్, ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి జి. సతీష్, అధ్యక్షుడు జి. మల్లికార్జున్, ఐఎన్‌టీయూసీ రీజియన్ కార్యదర్శి ఎన్‌.ఆర్‌. కృష్ణ, ఎస్‌డబ్ల్యూఎఫ్ రీజియన్ అధ్యక్షుడు చింతలచెరువు వెంకట కృష్ణారెడ్డి, రీజియన్ ఉపాధ్యక్షుడు జి. శంకర్, ఐఎన్‌టీయూసీ రీజియన్ అధ్యక్షుడు రాఘవులు, టీఎంయూ రీజియన్ అధ్యక్షుడు సి.హెచ్. కృష్ణ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్