Magazines

వీరనారి 'చిట్యాల ఐలమ్మ' జీవితం ఎందరికో ఆదర్శం

1 గంట క్రితం

ailamma
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం

- సీపీఐ(ఎం) జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు

- పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి వేడుక  

నవతెలంగాణ-సత్తుపల్లి 

​తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, వీరవనిత చాకలి (చిట్యాల) ఐలమ్మ జయంతి వేడుకను సీపీఐ(ఎం) సత్తుపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు మోరంపూడి పాండురంగారావు, సత్తుపల్లిలోని స్థానిక ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

​అనంతరం  పాండురంగారావు, పార్టీ పట్టణ కార్యదర్శి  కొలికపోగు  సర్వేశ్వరరావు  మాట్లాడారు. ఐలమ్మ జీవితం నేటి తరానికి ఎంతో ఆదర్శప్రాయమని కొనియాడారు.


భూస్వామ్య దోపిడీకి, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ఆమె సాగించిన వీరోచిత పోరాటం చరిత్ర  చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. అణగారిన వర్గాల హక్కుల రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ధీరవనిత ఐలమ్మ అని కొనియాడారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం సాధించడమే ఐలమ్మకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఆమె చూపిన పోరాట మార్గాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు రావుల రాజబాబు, చప్పిడి భాస్కర్, సైదా వెంకటేశ్వర్లు, మీరాజ్, రామకృష్ణ, జిలానీ, రఫీ, సంపత్, ప్రభాకర్ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్