Magazines

బెజ్జనమైన స్వామి కుటుంబానికి అండగా ఉంటాం

2 గంటల క్రితం

thoguta
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - తొగుట

మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బెజ్జనమైన స్వామి నిన్న అనారోగ్యం తో మృతి చెందాడు. విషయం తెల్సుకున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది రాజు వారి కుటుంబ సభ్యు లను పరామర్శించారు. పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ఆయ న మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ.3వేలు  ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి కుటుంబానికి గతంలోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయగా, ఇటీవలే ఇల్లు పూర్త యిందని తెలిపారు.


ఎంతో ఆశగా ఎదురుచూసిన ఆ ఇంట్లో స్వామి ఒక్క రోజు కూడా నివసించలేక పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో ఉన్న బెజ్జనమైన స్వామి కుటుంబా నికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంద ని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు బండారు రమేష్ గౌడ్, అత్మకమిటీ డైరెక్టర్ మిద్దె సంతోష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మహమ్మద్ షఫీ, యూత్ అధ్యక్షులు కల్లెపు నరేష్, సీనియర్ నాయకులు బెజ్జనమైన రాములు, బెజ్జ నమైన అనిల్, మిద్దె స్వామి, జంగపల్లి స్వామి, కల్లెపు భాస్కర్, లింగంపేట శివలింగం, ఏంగలి సత్తయ్య , వడ్డే నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్