Magazines

పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం 

55 నిమిషాల క్రితం

cmrf
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

సర్పంచ్ ధర్మానాయక్ 

నవతెలంగాణ-మిడ్జిల్

పేద ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని సర్పంచ్ ధర్మానాయక్ అన్నారు. మండలంలోని ఈదులబాయి తండాకు చెందిన రాత్లావత్ తిరుపతి నాయక్ మూడు నెలల క్రితం బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ అనారోగ్యంతో ఆసుపత్రిలో మృతి చెందడంతో సీఎం సహాయ నిధి ద్వారా రూ.5 లక్షల చెక్కును గురువారం సర్పంచ్ ధర్మానాయక్, గ్రామస్తులతో కలిసి భార్య రేణుకకు అందజేశారు.


ఈ సందర్బంగా సర్పంచ్‌ మాట్లాడుతూ..కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ భరోసా పథకం ద్వారా అండగా నిలిచిందని చెప్పారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వ సహకారంతో, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కృషితో  పేదరికం మహిళలకు సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు మంజూరు కావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.


ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ.. తమ కుటుంబం కష్టకాలంలో ఉన్న సమయంలో ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం ఎంతో విలువైనదని తెలిపారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు, వార్డ్ మెంబర్లు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్