Magazines

రైతులకు నిరంతర విద్యుత్‌ అందించేందుకు కృషి

1 గంట క్రితం

Power
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

డీసీసీ మాజీ అధికార ప్రతినిధి దుశ్యంత్ రెడ్డి 

 నవతెలంగాణ-నవాబుపేట

మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ కార్యాలయంలో రైతులకు అవసరమైన 24 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను డీసీసీ మాజీ అధికార ప్రతినిధి దుశ్యంత్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ సరఫరా విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అవసరమైన విద్యుత్ సబ్‌స్టేషన్లను మంజూరు చేయడంతో పాటు, రైతుల అవసరాలకు అనుగుణంగా ట్రాన్స్‌ఫార్మర్లను అందజేస్తున్నామని చెప్పారు. రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.


మండల కేంద్రంలో 133/33 సబ్ స్టేషన్ మంజూరు అయిన విషయం తెలిసిందే. త్వరలో పనులు ప్రారంభించేందుకు సంబంధించిన అధికారులు సన్నాహాలు చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు దాదాపు 350కి పైగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లు అందించిన ఘనత ఎంఎల్ఏ అనిరుద్ రెడ్డిదే అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తాణెం సుధాకర్ మార్కెట్ కమిటీ చైర్మన్ హరలింగం విద్యుత్ శాఖ అధికారులు సంతోష్, అఖిల్, వాసు యాదవ్, భూపాల్ రెడ్డి అంబదాస్ నాయక్ రవికిరణ్,రవి యాదవ్, మల్లేష్ గౌడ్ వెంకటేష్, శంకర్ భాస్కర్,బాగరి నర్సింహులు హమీద్ మహేక్ మైనోద్దీన్ ఎండీ ఉమర్, తాణెం రాజు శంకర్ నాయక్ సురెందర్ గౌడ్,బంక వెంకటయ్య బంక ఆంజనేయులు చిర్ప సత్యం బాలస్వామి రాజు బక్క బాలయ్య మాదవులు, రవి, కృష్ణ గౌడ్.లైన్ మెన్ లు శివ కుమార్, కృష్ణ ,సంతోష్, కాంట్రాక్టర్లు బాల్ రాజ్ నర్సింహులు గోపాల్ మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్